తాము తలచుకుంటే ఏపీ ఏన్జీఓలు తెలంగాణలో అడుగుపెట్టి హైదరాబాద్‌లో సభను నిర్వహించగలరా అని మాజీ మంత్రి ఆర్. దామోదర్‌రెడ్డి ప్రశ్నించారు.
అసెంబ్లీ ప్రాంగణంలోని మీడియా పాయింట్‌లో దామోదర్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ సూచన మేరకు తాము సంయమనం పాటిస్తున్నామని వివరించారు.
తాము తలచుకుంటే ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల పొలిమేరల్లోకి సీమాంధ్ర ప్రజలు అడుగు పెట్టగలరా అని ప్రశ్నించారు. సమైక్యవాదాన్ని విన్పిస్తున్న సీఎం కిరణ్ అధిష్ఠానం నిర్ణయాన్ని ధిక్కరిస్తున్నట్లుగా భావించడం లేదన్నారు.