నరేంద్ర మోడీ దున్నపోతుపై సవారీ చేసే యముడు : కాంగ్రెస్

FILE
భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించింది. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని బీజేపీ నేతలు విమర్శించడంతో.. బీజేపీ ప్రధాని అభ్యర్థిగా చెప్పుకుంటున్న నరేంద్ర మోడీపై కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పించారు.

ఈ క్రమంలో నరేంద్ర మోడీని కాంగ్రెస్ పార్టీ యుముడితో పోల్చింది. నరేంద్ర మోడీ దున్నపోతుపై సవారీ చేసే యుముడని దుయ్యబట్టింది. గుజరాత్‌కు సేవలందించడం ద్వారా... వారి రుణాన్ని తీర్చుకున్నాని.. ఇక భరత మాత రుణం తీర్చుకోవడమొక్కటే మిగిలిందని నరేంద్రమోడీ చెప్పడంపై... కాంగ్రెస్‌ పార్టీ తీవ్రస్థాయిలో ఫైరవుతోంది. 2002 గుజరాత్ అల్లర్ల ప్రభావాన్ని తెరపైకి తెస్తూ... మోడీని యమధర్మ రాజుతో పోల్చి యమగోలను రాజేస్తున్నారు.

గుజరాత్‌లో మోడీ ఇప్పటికే చేసింది చాలని... కేంద్రమంత్రి మనీష్ తివారీ అన్నారు. ఘర్షణల ప్రభావాన్ని దేశమంతా రిపీట్ చేస్తారా... అంటూ మండిపడ్డారు.

మనీష్ కామెంట్స్‌పై ఒకడుగు ముందుకేసిన కాంగ్రెస్ సీనియర్ నేత రషీద్ అల్వీ... మోడీని ఏకంగా యమధర్మరాజుతో పోల్చారు. దేశానికి సేవ చేయడమేమోగానీ... అంతా మృత్యుపాశమే వదులుతారంటూ.. తీవ్రస్థాయిలో విమర్శలు చేయడం.. సంచలనం సృష్టిస్తోంది. మరోవైపు మోడీ ఢిల్లీకి దగ్గరవుతుండడం... ఓర్వలేకే కాంగ్రెస్... విమర్శలు చేస్తోందని బీజేపీ విరుచుకుపడుతోంది.

వెబ్దునియా పై చదవండి