సాధారణంగా సూర్య, చంద్రగ్రహణాల సమయాల్లో చిన్నపాటి ఆలయాలతో పాటు.. ప్రసిద్ధ ఆలయాలను మూసివేయడం జరుగుతుంది. గ్రహణం ప్రారంభమయ్యే సమయం నుంచి గ్రహణం వీడిపోయేంత వరకు అన్ని రకాల పూజలు నిలిపివేయడమే కాకుండా ఆలయాలను కూడా మూసివేస్తుంటారు.
కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయం మాత్రం దీనికి అతీతం. ఇక్కడ గ్రహణ గండాలకు అతీతంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. శుక్రవారం రాత్రి సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. దీంతో మధ్యాహ్నం 2 గంటలకు అన్ని ఆలయాల తలపులు మూసివేయనున్నారు.
కానీ శ్రీకాళహస్తి ఆలయాన్ని మాత్రం తెరిచే ఉంచనున్నారు. దక్షిణ కైలాసంగా, వాయులింగేశ్వర క్షేత్రంగా పేరున్న శ్రీకాళహస్తీలో ఎప్పుడు గ్రహణం పట్టినా…. ఆలయాన్ని తెరిచే ఉంచి ప్రత్యేక పూజలు చేయడం ప్రత్యేకత. ఇక్కడ ప్రత్యేకంగా గ్రహణ కాల అభిషేకాలు నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది.