వరంగల్ జిల్లా, హనుమకొండ వెయ్యి స్తంభాల గుడి ప్రసిద్ధి పొందింది. వేయి స్తంభాల గుడి, ప్రాచీన వైభవాన్ని, అద్భుత శిల్ప సౌందర్యాన్ని చాటుతూ ఈనాటికీ చారిత్రక దర్పాన్ని ప్రదర్శిస్తున్నప్పటికీ శిథిలావస్థకు చేరుకుంటోంది.
వేయి స్తంభాల దేవాలయ సముదాయాన్ని క్రీ.శ. 1163లో కాకతీయ రాజు ఒకటవ రుద్రదేవుడు నిర్మించాడని చెప్పే శాసనం ఉంది.