ప్రజలకు జవాబుదారీగా ఉండి, క్రిందిస్థాయి ఉద్యోగులను ముందుండి నడిపించాల్సిన ఒక అధికారి పెడదారి పట్టాడు. తన సహ ఉద్యోగులతో కలిసి పేకాట ఆడారు. అది కూడా విధుల్లో ఉండాల్సిన సమయంలోనే. ఇప్పటికే సుపరిపాలన అందించాలన్న ధ్యేయంతో ఉన్న కెసిఆర్‌కు కొంతమంది ప్రభుత్వ ఉద్యోగస్తుల కారణంగా చెడ్డ పేరు వస్తోంది. తాజాగా తెలంగాణా రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో జరిగిన పేకాట సంఘటన చర్చనీయాంశంగా మారుతోంది.
ఓ వైపు పేకాటపై సీఎం కేసీఆర్ ఉక్కుపాదం మోపుతుండగా.. మరోవైపు ప్రభుత్వ జీతం తీసుకుంటున్న అధికారులే యధేచ్చగా పేకాట ఆడుతున్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం చెర్వుమాదారం సమీపంలో ఓ ఆర్డీవో ఇద్దరు డీటీలు, ఒక రెవెన్యూ ఇన్స్పెక్టర్ పేకాట ఆడుతూ పోలీసులకు పట్టుబడ్డారు.