తెలుగుదనం ఉట్టిపడేలా పంచెకట్టుతో రాజసంగా నడిచివస్తున్న బాలయ్య ఎంట్రీ అదిరిపోయింది. `ఎదుటి వాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో.. శ్రీను గారు మీ నాన్న గారు బాగున్నారా? అనే దానికీ, శ్రీను గారు మీ అమ్మ మొగుడు బాగున్నాడా? అనే దానికి చాలా తేడా ఉందిరా... అని నటసింహ నందమూరి బాలకృష్ణ చెప్పే పవర్ఫుల్ డైలాగ్ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. బాలయ్య బోయపాటి కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రం, ప్రేక్షకులు, అభిమానులు ఎక్స్పెక్ట్ చేస్తున్న స్థాయిలో మోస్ట్ పవర్‌ఫుల్‌గా మంచి కథా బలంతో పాటుగా చాలా గ్రాండియర్‌గా తెరకెక్కుతోంది. ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న#BB3కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియజేయనున్నారు.
నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సి. రాంప్రసాద్, సంగీతం: థమన్ ఎస్, మాటలు: ఎం.రత్నం, ఆర్ట్ డైరెక్టర్: ఎ.ఎస్. ప్రకాష్, ఎడిటింగ్: కోటగిరి వేంకటేశ్వరరావు, తమ్మిరాజు, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, సమర్పణ: మిర్యాల సత్యనారాయణ రెడ్డి, నిర్మాత: మిర్యాల రవీందర్‌రెడ్డి, దర్శకత్వం: బోయపాటి శ్రీను.