అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 సినిమా విషయంలో సీపీఐ నాయకుడు నారాయణ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. స్మగ్లింగ్‌ను కీర్తిస్తున్న చిత్రానికి ప్రభుత్వం సబ్సిడీలు మంజూరు చేసిందని ఆయన విమర్శించారు. స్మగ్లింగ్‌ను గౌరవప్రదంగా చిత్రీకరించిన సినిమాకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు ఎలా లభిస్తాయి? అని నారాయణ ప్రశ్నించారు.
ఇలాంటి దురదృష్టకర సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కళాకారులు, రచయితలపై ఉందని ఆయన నొక్కి చెప్పారు. అంతేకాకుండా, బాధితుడి కుటుంబానికి మద్దతు ఇవ్వాలని నారాయణ ప్రభుత్వాన్ని కోరారు. తన పార్టీ బాధిత కుటుంబానికి తన వంతు సహాయం అందిస్తుందని ప్రకటించారు.