అలాంటి బాగున్న సినిమా లిస్టులోకి వస్తుంది ఈ 'ప్రేమకు జై'చిత్రం. ఈ మూవీ పాటలు, ట్రైలర్, పిక్చరైజేషన్ చాలా బాగున్నాయి. దర్శకుడు మల్లం శ్రీనివాస్ ప్రతిభ కనిపిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్న ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందన్న నమ్మకం ఉంది." అని అన్నారు.
దర్శకుడు మల్లం శ్రీనివాస్ మాట్లాడుతూ.. "ఈ చిత్రం గ్రామీణ నేపథ్యంలో చోటు చేసుకున్న ఒక యదార్థ సంఘటన ఆధారంగా తెరకేక్కించాము. హీరో అనిల్ బురగాని, హీరోయిన్ జ్వలిత చాలా బాగా చేశారు. ప్రతి ఒక్క ఆర్టిస్టు, టెక్నీషియన్స్ కృషి, సపోర్ట్ వల్లే ఈ సినిమా ఇంత బాగా వచ్చింది. క్వాలిటీ విషయంలో నిర్మాత ఎంతో సహకరించారు. 'ప్రేమకు జై' సినిమాను ఆదరించాలని ప్రేక్షకులను కోరుకుంటున్నాం." అని అన్నారు.
వేడుకలో నటుడు అధిరే అభి, నిర్మాత ఎమ్ ఆర్ చౌదరి వడ్లపట్ల, నిర్మాత చందర్ గౌడ్, దర్శకుడు లారెన్స్ పలువురు సినీ ప్రముఖులు పాల్గొని చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు. వచ్చే నెలలో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.