బుల్లితెరపై కనిపించనున్న రేణు దేశాయ్..

ఆదివారం, 10 సెప్టెంబరు 2017 (11:05 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వున్నారు. ఇటీవల సినీ విశ్లేషకుడు కత్తి మహేష్‌పై కూడా ఫైర్ అయిన రేణు దేశాయ్.. తాజాగా టీవీ షో నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్‌తో సహజీవనం చేసి ఇద్దరు పిల్లల తల్లి అయిన రేణు దేశాయ్ త్వరలో బుల్లితెరపై అలరించనుంది. టాలీవుడ్‌లో మెగా హీరోగా ఉన్న పవన్‌కు పోటీగా తెలుగు బుల్లితెరపై ఆమె కనిపించనున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో టాక్. 
 
పవన్‌కు దూరమైన రేణు దేశాయ్.. పూణేలో ఉంటున్న ఆమె తన ఇద్దరు పిల్లల కెరీర్ దృష్టిలో పెట్టుకుని చాలాకాలంగా అక్కడే ఉంటున్నారు. తాజాగా రేణు బుల్లితెరపై ఓక షో చేసేందుకు సిద్ధమైంది. డాన్స్ షోతో కూడిన ప్రోగ్రామ్ చేసేందుకు అంగీకరించినట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో వార్తలు షికార్లు చేస్తోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు