వరుణ్ తేజ్ గని సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వరుణ్ తేజ్ 10 వ సినిమాగా తెరకెక్కుతుంది. అందుకే ఈ యాక్షన్ డ్రామాను ఆయన ఎంచుకున్నారు. ఈ చిత్ర కథ బాక్సింగ్ నేపథ్యంలో సాగుతుంది. అందుకే బాక్సింగ్ కోర్టుకు సంబంధించిన సెట్‌ను అన్నపూర్ణ ఏడెకరాల స్టూడియోలో ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు దాదాపు 50 మంది పనిచేస్తున్నారు. కోర్టు రింగ్‌లో బాక్సింగ్ ఆడే క్రమంలో అందుకు సంబంధించిన కింద బెడ్లను పర్యవేక్షకుల సమక్షంలో తీర్చిదిద్దుతున్నారు. ఈనెలాఖరు నుంచి అక్కడ బాక్సింగ్ పోటీని చిత్రీకరించనున్నారు.