వాయువ్యం భ్రష్టుపట్టడం అంటే ఏమిటి? వాస్తు టిప్స్!

FILE
1. ఉత్తర వాయువ్యం నడక ఉన్నా, ఈశాన్యంకన్నా వాయువ్యం పల్లంగా ఉన్నా, వాయువ్యంలో బావులు ఉన్నా వాయువ్యం భ్రష్టుపడటం అంటారు. ఇది మంచిది కాదు.

2. నైరుతిలో నిర్మించే చుట్టిల్లు స్థలం హద్దులపై నిర్మించరాదు. ప్రహరీగోడకి చుట్టిల్లుకు మధ్యలో తప్పకుండా ఖాళీస్థలం వదలవలెను.

3. ఇంటికి నాలుగుపక్కలా ప్రహరీ గోడ తప్పక నిర్మించాలి. ఒక దిక్కులో ప్రహారీ గోడ నిర్మించి మిగిలిన దిక్కులలో ప్రహరీగోడ నిర్మించకుండా వదిలెయ్యడం కూడా మంచిది కాదు. తప్పకుండా ప్రహరీగోడ నిర్మించాలి. దీని వలన స్థలం హద్దులు కూడా తెలుస్తాయి.

4. ఇతరుల ఇళ్ళనుండి వాడుకనీరు కాని, వర్షపు నీరుకాని మన ఇంటిలోకి రాకూడదు. అలాగే మన ఇంటిలోని వాడుకనీరు, వర్షపునీరు వాళ్ళ ఇళ్ళల్లోనికి ప్రవహించుట మంచిది కాదు.

వెబ్దునియా పై చదవండి