ఫేస్ బుక్‌లో ఇద్దరి మధ్యా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమకు దారితీసింది. చివరకు సహజీవనం వరకు వెళ్ళింది. ఒకటి రెండు కాదు ఏకంగా నాలుగన్నరేళ్ళు ప్రియుడితో కలిసి సహజీవనం చేసింది. ప్రియుడిని నమ్మి 45 లక్షలు రూపాయలు ఇచ్చింది. ఇంకేముంది పెళ్ళి మాట వచ్చేసరికి ముఖం చాటేశాడు. కనిపించకుండా పారిపోయాడు. దీంతో లబోదిబోమంటూ బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.
చివరకు పెళ్ళి చేసుకుంటాడని నమ్మింది. కానీ అరవింద్ మాత్రం పెళ్ళి చేసుకోనని ముఖం మీద చెప్పేశాడు. దీంతో టంగుటూరు పోలీసులను ఆశ్రయించింది. అయినా ఉపయోగం లేకుండా పోయింది. రాజకీయ ఒత్తిళ్ళలో అరవింద్ పై కేసు నమోదు చేయలేదు. అరవింద్ ఇంటి ముందు బైఠాయించింది. అరవింద్ ఇంటికి తాళాలు వేసి ఎక్కడికో పారిపోయాడు. దీంతో సహస్ర లబోదిబోమంటూ మీడియాను ఆశ్రయించింది. న్యాయం జరుగకుంటే ఆత్మహత్యే శరణ్యమంటోంది సహస్ర.