'సర్.. మీరు కాబోయే ముఖ్యమంత్రి' అంటూ నవ్వుతూ వచ్చి దాడి.. కారణం అదేనా?

గురువారం, 25 అక్టోబరు 2018 (14:04 IST)
వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డిపై విశాఖ విమానాశ్రయం లాంజ్‌లో దాడి జరిగింది. అమలాపురంకు చెందిన ఓ యువకుడు సెల్ఫీ తీసుకుంటానంటూ జగన్‌ వద్దకు వచ్చి కోళ్ల పందాలకు ఉపయోగించే కత్తితో దాడి చేశాడు. దీంతో జగన్ భుజానికి స్వల్పంగా గాయమైంది. 
 
ఈ దాడి చేసిన యువకుడిని శ్రీనివాస్‌గా గుర్తించారు. ఎయిర్‌పోర్టులోని ఓ హోటల్‌లో వెయిటర్‌గా పని చేస్తున్నాడు. ఇతడు అమలాపురానికి చెందిన వ్యక్తిగా నిర్ధారించారు. దాడి చేసిన వెంటనే ఆ వ్యక్తిని భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకుంది. 
 
హోటల్‌ వెయిటర్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్‌ అనే వ్యక్తి వైఎస్‌ జగన్‌తో సెల్ఫీ తీసుకుంటాను అన్నాడు. వైఎస్‌ జగన్‌ సరేననడంతో..  'మీరు కాబోయే ముఖ్యమంత్రి' అంటూ నవ్వూతూ ఎదురుగా వచ్చిన శ్రీనివాస్‌ ఒక్కసారిగా ఆయనపై దాడికి దిగాడు. ఊహించని ఘటన ఎదరుకావడంతో వైఎస్‌.జగన్‌ ఒక్కసారిగా పక్కకు తిరిగారు. 
 
దీంతో కత్తివేటు వైఎస్‌.జగన్‌ భుజంపై పడింది. కోడి పందాల్లో ఉపయోంచే కత్తితో ఈ దాడి జరిగింది. ఇది ముమ్మాటికే జగన్‌పైన జరిగిన హత్యాయత్నమే. ఒకవేళ వైఎస్‌.జగన్‌ చాకచక్యంగా వ్యవహరించకపోయుంటే ఏం జరిగేదనేది ఊహకే అందని ప్రశ్న.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు