స్వామి క్షమించు, టిటిడి ఛైర్మన్ సతీమణి చేతిలో బైబిల్

బుధవారం, 8 జులై 2020 (17:13 IST)
వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి జన్మదినం సంధర్భంగా ఇడుపుల పాయలో టిటిడి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి సతీమణి స్వర్ణలత చేతుల్లో బైబిల్ పుస్తకం ఉండడం చర్చనీయాంశంగా మారింది. జయంతి కార్యక్రమంలో భాగంగా ఆమె బైబిల్‌ను చదువుతూ ఉండడం కనిపించింది. సాధారణంగా టిటిడి నియమాల ప్రకారం హైందవేతరులు టిటిడి ఉన్నత పదవుల్లో ఉండటం నిషేదం. 
 
అయితే స్వయానా టిటిడి ఛైర్మన్ సతీమణి అన్యమత గ్రంథం చేతపట్టుకుని చదువుతూ ఉండటం మరింత చర్చకు దారితీస్తోంది. అయితే దీనిపైన ప్రతిపక్ష పార్టీల నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సర్వమత ప్రార్థనల్లో భాగంగా బైబిల్‌ను స్వర్ణలత చేతిలో పట్టుకున్నారని.. దీనిపై పెద్ద రాద్దాంతం చేయాల్సిన అవసరం లేదంటున్నారు వైసిపి నాయకులు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు