హైదరాబాదులో రెండో పెళ్లికి సిద్ధమైన బిజినెస్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. మొదటిభార్యకు తెలియకుండా రెండో వివాహం చేసుకోవాలని భావించిన అతని కోసం వెతుకుతున్నారు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాదులోని సంతోష నగర్‌కు చెందిన బిజినెస్‌మేన్ అన్వర్ రెండో పెళ్లికి సిద్ధమయ్యాడు. రెండో పెళ్లికి తొలి భార్యకు తెలియకుండా చేసుకునేందుకు సర్వం సిద్ధం చేసుకున్నాడు.
ప్రేమించి పెళ్లి చేసుకుని... ఇద్దరు పిల్లల్ని కన్నాక ఎందుకు మోసం చేస్తున్నావని ప్రశ్నించింది. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. పోలీసులను చూసిన అన్వర్ పారిపోయాడు. అతనిపై చర్యలు తీసుకోవాలని తొలిభార్య ఫిర్యాదు చేయడంతో అతని కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.