ఆంధ్రాలో కరోనా వైరస్ విశ్వరూపం... కృష్ణా - నెల్లూరుల్లో మరింత వేగంగా..

శనివారం, 4 ఏప్రియల్ 2020 (18:27 IST)
ఢిల్లీ మర్కజ్ మత సమ్మేళనం తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. గత నాలుగైదు రోజులుగా అత్యధిక స్థాయిలో ఈ కేసులు నమోదవుతున్నాయి. ఫలితంగా డబుల్ సెంచరీకి చేరువయ్యాయి. 
 
ముఖ్యంగా, నెల్లూరు, కృష్ణా జిల్లాలో మరింత విపరీతంగా ఈ కేసులు వ్యాపిస్తున్నాయి. శనివారం కృష్ణా జిల్లాలో కొత్తగా 5, గుంటూరులో 3, ప్రకాశం, అనంతపూర్ జిల్లాలో ఒక్కొక్క కేసు నమోదయ్యాయి.
 
కొత్తగా నమోదైన 10 కేసులతో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 180 కి పెరిగిందని ప్రభుత్వం వివరించింది. కృష్ణా, నెల్లూరులో అత్యధికంగా 32 కేసుల చొప్పున నమోదయ్యాయి. జిల్లాల వారీగా ఈ కేసులను పరిశీలిస్తే, 
 
అనంతపూర్‌లో 3, చిత్తూరులో 10, ఈస్ట్ గోదావరిలో 11, గుంటూరులో 26, కృష్ణాలో 32, కర్నూలులో 4, నెల్లూరులో 32, ప్రకాశంలో 19, విశాఖపట్టణంలో 15, వెస్ట్ గోదావరిలో 15 చొప్పున మొత్తం 190 కేసులు నమోదయ్యాయి. శ్రీకాకుళం, విజయనగరంలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు