విశాఖ జిల్లా నర్సీపట్నం పోలీస్ స్టేషన్లో ముందస్తు బెయిల్ సమర్పించిన అనంతరం అంబేద్కర్ కూడలి వద్ద బహిరంగ సభ ఏర్పాటు చేశారు. జగన్కు దమ్ముంటే పంచాయతీ ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్లతో బరిలో దిగాలని అయ్యన్నపాత్రుడు సవాల్ విసిరారు. ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా రిజర్వేషన్లు కేటాయించి, ఎన్నికలు తప్పించుకునే ప్రయత్నాలు చేయొద్దన్నారు.
కోడి పందాలపై... తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కోడి పందేలు పెడితే నర్సీపట్నంలో తాను నిర్వహిస్తానని అయ్యన్న ప్రకటించారు. ఆ జిల్లాలకు ఒక న్యాయం... విశాఖ జిల్లాకు ఒక న్యాయమా అని ప్రశ్నించారు. రెండు రోజుల పాటు నర్సీపట్నంలో స్వయంగా కోడిపందేలు నిర్వహిస్తానని అన్నారు. ఎవరు అడ్డుకుంటారో చూద్దామన్నారు.