హైదరాబాద్ నగరానికి చెందిన ఓ యువతికి జులాయ్‌గా తిరిగే ఓ యువకుడు గట్టివార్నింగ్ ఇచ్చాడు. తనను ప్రేమించి, కోర్కె తీర్చకుంటే ముఖంపై యాసిడ్ దాడి చేస్తానంటూ బెదిరించాడు. దీంతో భయపడిపోయిన ఆ యువతి నగర పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ వివరాలను పరిశీలిస్తే,
ఆ యువతి అందుకు నిరాకరించడంతో తన వెంట తెచ్చిన యాసిడ్ బాటిల్ చూపించి ముఖం మీద పోస్తానని బెదిరించాడు. బలవంతంగా యువతిని ద్విచక్రవాహనంపై ఎక్కించుకుని వెళ్లాడు. దీన్ని గమనించిన కొందరు బంజారా హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిఖిల్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.