తెలంగాణ రాష్ట్రంలోని గద్వాల్ జిల్లా, రాజపురం గ్రామానికి చెందిన విజయేంద్ర గత కొంతకాలంగా పీర్జాదిగూడ మున్సిపల్ పరిధిలోని సిరిపురి కాలనీకి చెందిన నరేంద్ర ఇంట్లో అద్దెకు ఉంటూ కూరగాయల వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్నాడు. అలా మంచివాడిగా ముద్రవేసుకున్నాడు.
అద్దెకు ఉంటూ ఓనర్ ఇంట్లోనే దొంగతనం చేసినట్టు విచారణలో పోలీసులు గుర్తించారు. మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో రెండు బైక్‌లు చోరీ చేసినట్లు గుర్తించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. అతడి నుంచి 3 తులాల నెక్లెస్, రెండు బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు.