ఈ వివరాలను పరిశీలిస్తే, మల్కాజిగిరికి చెందిన చిన్నప్ప(50), నేనావత్ విజయ్ కుమార్(53) అనే ఇద్దరు వ్యక్తులు ఈ నెల 17వ తేదీ అర్థరాత్రి పూటుగా మద్యం సేవించారు. ఆ తర్వాత రోడ్డు పక్కన కూర్చున్న యాచకురాలితో మాటలు కలిపి తమ ఇంటికి తీసుకెళ్లి ఆమెకు కూడా మద్యం తాగించారు.
దీంతో ఆమె మత్తులోకి జారుకుంది. ఇదే అదునుగా భావించిన ఆ ఇద్దరు కామాంధులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. కొద్దిసేపటికి స్పృహలోకి వచ్చిన బాధితురాలు కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు, పోలీసులకు ఫోన్ చేశారు. అప్పటికే నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. వారిని శుక్రవారం మిర్జాలగూడలో పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు.