ముగ్గురితో భర్త అక్రమ సంబంధం... ప్రేమగా అన్నం పెట్టి అలా చేసిన భార్య...

బుధవారం, 30 మే 2018 (13:41 IST)
అక్రమ సంబంధం వద్దని భర్తకు ఎన్నోసార్లు చెప్పి చూసింది. అయినా అతనిలో ఎలాంటి మార్పు రాలేదు. ఒకరు, ఇద్దరు, ఆ తరువాత ముగ్గురితో అక్రమ సంబంధం పెట్టుకుని భార్యను గాలికొదిలేశాడు. దీంతో ఆవేశం కట్టలుతెంచుకున్న భార్య సహనం కోల్పోయి భర్తను రోకలి బండతో కొట్టి చంపేసింది. గుంటూరు జిల్లా తాడికొండలో జరిగిన సంఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లోను తీవ్ర చర్చనీయాంశంగామారుతోంది.
 
తాడికొండ మండలం కంతేరు గ్రామానికి చెందిన లక్ష్మి, సతీష్‌‌కు ఐదు సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరిద్దరికి ఇద్దరు పిల్లలున్నారు. సంవత్సరం నుంచి భర్త ఇంటికి రావడం తగ్గించేశాడు. ఎప్పుడూ ఏదో ఒక పని అని చెబుతూ రాత్రుల్లో కూడా ఇంటికి రావడం మానేశాడు. చుట్టపు చూపులా అప్పుడప్పుడు వచ్చి వెళుతుండేవాడు. దీంతో భార్య లక్ష్మికి అనుమానం వచ్చింది. తన భర్త కొంతమంది మహిళలతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని తెలుసుకుంది.
 
ఇంటికి వచ్చిన భర్తకు చాలాసార్లు నచ్చజెప్పింది. మన కాపురాన్ని మనమే చేజేతులా నాశనం చేసుకోకూడదని ప్రాధేయపడింది. అయినా భర్తలో మార్పు రాలేదు. ముగ్గురు మహిళలతో అక్రమ సంబంధం కొనసాగించాడు. దీంతో భార్య సహనాన్ని కోల్పోయింది. అర్థరాత్రి ఇంటికి వచ్చిన భర్తకు ప్రేమగా భోజనం పెట్టి పడుకున్న తరువాత రోకలి బండతో తలపై కొట్టి చంపేసింది. ఆ తరువాత నేరుగా పోలీస్టేషనుకు వెళ్ళి లొంగిపోయింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు