సీఎం పదవి ముష్టి అడిగితే వచ్చేది కాదు.. మంత్రి సీదిరి

శనివారం, 17 జూన్ 2023 (17:03 IST)
జనసేనాని పవన్ కల్యాణ్‌పై మంత్రి సీదిరి అప్పులరాజు సెటైర్లు విసిరారు. సీఎం పదవి ప్రజలు ఇవ్వాలి తప్ప.. ముష్టి అడిగితే వచ్చేది కాదని కౌంటర్ ఇచ్చారు. ఇంతకీ పవన్ తాను ఎమ్మెల్యేగా గెలిచేందుకు తిరుగుతున్నాడా.. లేకుంటే తన ఎమ్మెల్యేల్ని గెలిపించుకునేందుకా అంటూ ప్రశ్నించారు. 
 
అసలు పవన్ కల్యాణ్ ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తాడో డిసైడ్ కావాలని చురకలంటించారు. వారాహి యాత్ర అసంబద్ధమైన యాత్ర అంటూ విమర్శలు గుప్పించారు. 
 
చెప్పుల గురించి మాట్లాడుతున్న పవన్.. తన పార్టీ గుర్తు గురించి మాట్లాడాలని మండిపడ్డారు. చెప్పులు మర్చిపోతే తెచ్చుకోవచ్చు కానీ.. పార్టీ గుర్తు పోతే ఎలా అంటూ ప్రశ్నించారు. పవన్ ముందు తన గుర్తు ఎక్కడుందో వెతుక్కోవాలన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు