అమాయకుడైన జగన్‌కు న్యాయం చేయండి ప్లీజ్.. నాగబాబు విజ్ఞప్తి

సెల్వి

సోమవారం, 29 జులై 2024 (12:33 IST)
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై జనసేన నేత నాగబాబు ఫైర్ అయ్యారు. జగన్ మోహన్ రెడ్డికి న్యాయం చేయాలంటే కూటమి సర్కారును కోరారు. 2019కి ఎమ్మెల్యే, ఆపై ఏపీ ముఖ్యమంత్రిగా మారి.. ప్రస్తుతం పులివెందుల ఎమ్మెల్యేగా మిగిలినటువంటి జగన్ మోహన్ రెడ్డికి కూటమి ప్రభుత్వం న్యాయం చేయాలని సెటైరికల్ కామెంట్స్ చేశారు నాగబాబు 
 
ఎందుకంటే 2019లో శ్రీను అనే వ్యక్తి ఆయన మీద కోడికత్తితో దాడి చేశాడని.. ఐదేళ్లైనా ఈ కేసు కొలిక్కి రాలేదని నాగబాబు ఎత్తిచూపారు. అప్పుడంటే జగన్ మోహన్ రెడ్డిగారి కున్న బిజీ షెడ్యూల్ వల్ల ఆయనకి కుదర్లేదు. ఇపుడు ఆయన ఖాళీగానే ఉన్నారు. కాబట్టి కూటమి ప్రభుత్వం ఆయనకి న్యాయం చేయాల్సిన అవసరం అత్యవసరంగా ఉంది.
 
కాబట్టి అతని మీద హత్యాయత్నం చేసిన నేరస్థుడికి సరైన శిక్ష విధించాలి కదా అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాబట్టి ఈ కేసును వెంటనే విచారించి.. అమాయకుడైన జగన్‌కు న్యాయం చేయాల్సిందిగా.. కూటమి ప్రభుత్వాన్ని, సీఎం, డిప్యూటీ సిఎం, హోం మంత్రిని నాగబాబు కోరారు.
 
అలాగే మదనపల్లె సబ్ కలెక్టరేట్‌లో జరిగిన అగ్ని ప్రమాదం వ్యవహారంలో జగన్ చేసిన వ్యాఖ్యలపై కూడా నాగబాబు ఫైర్ అయ్యారు. సబ్ కలెక్టర్ ఆఫీసులో రికార్డుల దగ్ధం కావడానికి మాజీ మంత్రి పెద్దిరెడ్డి కారణమని ఆరోపణలు వినిపిస్తున్నాయి. 
 
ఈ క్రమంలో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పెద్దిరెడ్డి అంటే చంద్రబాబుకు అస్సలు పడదని అన్నారు. వారు ఇద్దరూ క్లాస్ మేట్స్ అని.. ఇద్దరూ కాలేజీలో చదువుకునే సమయంలో చంద్రబాబును పెద్దిరెడ్డి కొట్టారని జగన్ అన్నారు. 
 
అందువల్లే పగ బట్టి ఇప్పుడు చంద్రబాబు పెద్దిరెడ్డిపై ప్రతీకారం తీర్చుకుంటున్నారని జగన్ వ్యాఖ్యలు చేశారు. జగన్ వ్యాఖ్యలను కామెడీ అని ఎద్దేవా చేశారు. కనీసం వాటికి కాస్త కామన్ సెన్స్ యాడ్ చేయండి అంటూ నాగబాబు హితవు పలికారు. ఈ మేరకు జగన్ ను ఉద్దేశించి నాగబాబు ఎక్స్ ద్వారా ఓ పోస్టు చేశారు. ఈ పోస్ట్ కూడా నెట్టింట వైరల్ అవుతోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు