ఏపీకి లిక్విడ్ నైట్రోజన్ గ్యాస్ ట్యాంకర్ల ద్వారా ఆక్సిజన్ రవాణా!

శనివారం, 1 మే 2021 (11:23 IST)
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వాడుతున్న లిక్విడ్ నైట్రోజన్ గ్యాస్ ట్యాంకర్లను ఆక్సిజన్ రవాణాకు వాడేటట్లు మార్పులు చేశారు. ప్రస్తుతం 9 ట్యాంకర్లలో రెండు ఏపీకి ఇవ్వడానికి సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారని కోవిడ్ స్పెషలాఫీసర్ ఎంటి కృష్ణబాబు వివరించారు. 
 
రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు ఇచ్చిన నేపధ్యంలో అధికారులు సిద్ధమవుతున్నారు. ఒరిస్సాలోని అంగూల్ నుండి ఆక్సిజన్ రవాణాకు ఎయిర్ఫోర్స్ 2 ట్యాంకర్లను విజయవాడ లేదా తిరుపతి నుండి వాయు మార్గాన భువనేశ్వర్ కి చేర్చడానికి ఒప్పందం చేసుకున్నామని చెప్పారు. 
 
కేంద్రం ప్రభుత్వం దిగుమతి చేసుకునే ఐఎస్ఓ కంటైనర్ ట్యాంకర్‌లలో కూడా రాష్ట్రానికి ఇచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. ఈ ట్యాంకును ఆసుపత్రిలో 17 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో నెలకొల్పేందుకు అవకాశం ఉందని, ఒక వారం లోపు మరో రెండు ఆక్సిజన్ ట్యాంకులను మన సర్క్యూట్‌లో పెట్టడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నామని వివరించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు