దీంతో మామకు ఫోన్ చేస్తే స్పందన లేకపోవడంతో కంగారుపడిన భర్త, ఈ నెల పదో తేదీన ఖాజీపేట పోలీసుస్టేషన్‌లో మిస్సింగ్ కేసు పెట్టాడు. తన భార్య ఎంతో మంచిదని, ఆమెను ఎవరో ఎత్తుకుపోయారని వాపోయాడు. దీనిపై ఖాజీపేట పోలీసులు అప్రమత్తమై, విచారణ చేపట్టారు. మౌనిక వివరాల కోసం ప్రకాశం జిల్లాకు వెళ్లి ఆరా తీయగా, నివ్వెరపరిచే విషయాలు పోలీసుల దృష్టికి వచ్చాయి.
పోలీసుల విచారణలో మౌనికకు అప్పటికే నాలుగు పెళ్లిళ్లు అయినట్టు తేలింది. ప్రతి సందర్భంలోనూ ఒక్కో భర్త వద్ద కొద్దిరోజులు ఉండి.. అక్కడ కొంతమొత్తం సొమ్ము, నగలు తీసుకుని చెక్కేస్తూ వచ్చేది. మౌనిక వరుస పెళ్లిళ్ళకు ఆమె తండ్రితో పాటు.. ప్రియుడు నాయక్‌లు తమ వంతు సహకారం అందించారు. ఇలా నలుగురు యువకులను ఒకరికి తెలియకుండా ఒకరిని పెళ్లాడింది.
ప్రతి సందర్భంలోనూ ఎవరికీ అనుమానం కలుగకుండా మెట్టినింట నడుచుకునేది. ఆ తర్వాత తండ్రి రావడం, పుట్టినింటికి బయలుదేరడం షరామామూలే. ఓ ఇద్దరిని మాత్రం విడాకులు ఇచ్చి వదిలించుకున్నట్టు సమాచారం. కానీ రామకృష్ణారెడ్డి ఫిర్యాదుతో మౌనిక రెడ్డి బండారం బయటపడింది. ఇటీవలే నాయక్‌ను ఆమె పెళ్లి చేసుకున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో సోమవారం హైదరాబాద్‌లో ప్రియుడిని, మైదుకూరులో మౌనిక, అనంతరెడ్డిని కడప పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.