మరింత బలపడిన అల్పపీడనం - నేడు, రేపు ఏపీలో వర్షాలు

ఠాగూర్

బుధవారం, 11 డిశెంబరు 2024 (09:04 IST)
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింతగా బలపడింది. నైరుతి బంగాలాఖాతాన్ని ఆనుకుని ఆగ్నేయ బంగాళాఖాతంలో మంగళవారం అల్పపీడనం ఏర్పడిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) వెల్లడించింది. దీని ప్రభావం కారణంగా వచ్చే 24 గంటల్లో ఇది పశ్చిమ మధ్య వాయవ్య దిశగా పయనిస్తూ శ్రీలంక - తమిళనాడు తీరాలకు చేరువగా వస్తుందని వివరించింది. 
 
ఈ తీవ్ర అల్పపీడనం ప్రభావంతో ఈ నెల 11వ తేదీ బుధవారం నాడు నెల్లూరు అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే, ఏలూరు, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 
 
ఈ నెల 12వ తేదీన నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, సత్యసాయి, కడప జిల్లాల్లో మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని, ప్రకాశం, పల్నాడు, నంద్యాల, కర్నూలు, బాపట్ల జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని ఏపీఎస్డీఎంఏ తెలిపింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు