ఏపీ సీఎం జగన్ ఆలోచన నవశకానికి నాంది : కేతిరెడ్డి

శుక్రవారం, 10 సెప్టెంబరు 2021 (15:07 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా టిక్కెట్ల విక్రయం కోసం ప్రభుత్వం ఓ ఆన్‌లైన్ పోర్టల్‌ను ప్రారంభిచనున్నట్టు వార్తలు వచ్చాయి. ముఖ్యంగా, సినిమా టిక్కెట్లు ఆన్‌లైన్‌ ద్వారా ప్రభుత్వ పోర్టల్‌లో మాత్రమే విక్రయించాలన్న నిర్ణయానికి సీఎం జగన్ సర్కారు వచ్చింది. దీనిపై సినీ నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి స్పందిస్తూ, ఈ సినిమా టిక్కెట్లను ప్రభుత్వ పోర్టల్‌లో విక్రయించాలన్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆలోచన చరిత్రాత్మకం' అని వ్యాఖ్యానించారు. 
 
ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. టిక్కెట్ల దోపిడీ గురించి తెలుసుకున్న జగన్‌గారు ఇలాంటి ఆలోచన చేస్తున్నారు. ఈ నిర్ణయం వల్ల ప్రేక్షకులకు వినోదం భారం కాదు.. పైగా నిర్మాతలు చిత్ర నిర్మాణ ఖర్చులను తగ్గించుకునేందుకు దోహదపడుతుంది. బడ్జెట్‌ అదుపులో ఉంటుంది. 
 
సీఎం జగన్ ఆలోచన చిత్రపరిశ్రమ అభివృద్ధికి దోహదపడుతుంది. ముఖ్యంగా కార్మికులకు, చిన్న నిర్మాతలకు మేలు జరుగుతుంది. కానీ కొంత మంది నిర్మాతలు తమ వ్యక్తిగత లాభాలకు గండి పడుతుందని భావించి, ఆ ఆలోచన తప్పు అని ప్రచారం చేస్తున్నారు. త్వరలో జగన్‌‌ని కలిసి, పరిశ్రమలోని సమస్యలను వివరిస్తాం' అని తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు