ఆరేళ్ళ తర్వాత లాభాలు అర్జించిన వైజాగ్ స్టీల్ ప్లాంట్

ఆదివారం, 10 ఏప్రియల్ 2022 (16:13 IST)
వైజాగా స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయాలని కేంద్ర ప్రభుత్వం గట్టి పట్టుదలతో అడుగులు ముందుకేస్తుంది. మరోవైపు ఈ ప్లాంట్ ప్రైవేటీకరణను ఏపీ ప్రజలు, స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆరేళ్ల తర్వాత లాభాలను అర్జించింది. 
 
2021-22 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ 835 కోట్ల రూపాయల లాభాన్ని సాధించిందని స్టీల్ ఫ్యాక్టరీ సిఎండి అతుల్ భట్ తెలిపారు. బొగ్గు కొరత, అంతర్జాతీయకరణ సమస్యలను పరిష్కరించడంలో కొత్త పుంతలు తొక్కుతున్నందుకు వివిధ డివిజన్ల కార్మికులతో పాటు మొత్తం సంస్థను ఆయన ప్రశంసించారు.
 
ఉక్కునగరం క్లబ్‌లో జరిగిన టాప్ ఎగ్జిక్యూటివ్‌లు, ట్రేడ్ యూనియన్‌లు, ఉద్యోగుల వార్షిక సమావేశంలో పాల్గొన్న ఆయన, 2020-21లో రూ.17,978 కోట్లు, 2021-22లో రూ.28,082 కోట్లతో విక్రయాలు 57 శాతం పెరిగాయని పేర్కొన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు