వివరాలు పరిశీలిస్తే... విశాఖ దాబా గార్డెన్స్ ప్రాంతంలో నిర్మాణంలో వున్న భవనం కాపౌండ్ వాల్ అకస్మాత్తుగా కూలిపోయింది. తవ్వకం పనుల్లో వున్న ముగ్గురు కూలీలపై మట్టి పెళ్ళలు పడ్డాయి. ఈ ప్రమాదంలో శంకర్రావ్, శివ శిథిలాల క్రింద చిక్కుకుని మృత్యువాతపడ్డారు. మృతుడు శంకర్రావ్.... విజయనగరం జిల్లా, బాడంగి ప్రాంతానికి చెందినవాడు.
రెస్క్యూ ఆపరేషన్‌ను డీసీపీ రంగారెడ్డి స్వయంగా పర్యవేక్షించారు. హుటాహుటీన ప్రొక్లైనర్లు, ఫైర్ ఇంజన్లను రంగంలోకి దించారు. స్థానిక కార్మికులతో పాటు రెస్క్యూ సిబ్బంది.... సుమారు రెండు గంటల పాటు తీవ్రంగా శ్రమించి బండరాళ్ళ మధ్య చిక్కుకున్న మృతదేహాలను వెలికితీశారు. కోయంబత్తూరుకు చెందిన ఓ మత సంస్థ కోసం ఈ భవన నిర్మాణం జరుగుతోంది. ప్రమాదానికి కాంట్రాక్ట్ సంస్థ నిర్లక్ష్యమే కారణమని అధికారులు అంచనాకు వచ్చారు.