కామంతో కళ్లుమూసుకునిపోయిన ఓ కామాంధుడు, తన బిడ్డను ఆడించడానికి ఇంటికి వచ్చే 17 యేళ్ల బాలికను గర్భవతిని చేశాడు. ఈ కామాంధుడు ఓ మహిళా టీచర్ భర్త కావడం గమనార్హం. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు వద్ద జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
జిల్లాలోని తూర్పుపాలెం శివారు ప్రాంతానికి చెందిన వ్యక్తి భార్య ఉపాధ్యాయురాలిగా పని చేస్తోంది. వీరికి ఓ చంటిబిడ్డ ఉన్నాడు. అయితే, టీచర్ బడికి వెళ్లగా, ఆమె భర్త ఇంటిపట్టునే బిడ్డ ఆలనాపాలనా చూస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో పక్కింటికి చెందిన 17 యేళ్ల బాలిక ఈ పిల్లాడిని ఆడించడానికి తరచూ టీచరమ్మ ఇంటికి వస్తూపోతూ ఉండేది.
ఈ క్రమంలో ఇంటికి వచ్చే బాలికను అతడు మాయమాటలు చెప్పి శారీరకంగా లొంగదీసుకున్నాడు. ప్రస్తుతం ఆమె తొమ్మిది నెలల గర్భిణి. ఈ విషయం అతడి భార్యకు తెలియడంతో భార్యభర్తలిద్దరూ కలిసి బాలికకు అబార్షన్ చేయించడానికి కూడా ప్రయత్నించారు. అయితే, ఆ బాలిక తల్లిదండ్రులకు చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో స్థానిక పోలీసులు నిందితుడిపై అత్యాచారం, ఇతర సెక్షన్ల కింద కేసు చేశారు.