ఏపీలో పంచాయతీ ఎన్నికలు సజావుగా సాగేలా రాష్ట్ర గవర్నర్ హరిచందన్ బిశ్వభూషణ్ చర్యలు తీసుకోవాలని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు విజ్ఞప్తి చేశారు. ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఆయన స్పందించారు.
పంచాయతీ ఎన్నికలు సజావుగా సాగేలా గవర్నర్ తన అధికారాలను వినియోగించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రాజ్యాంగానికి లోబడి తమ విధులు నిర్వర్తిస్తామని ప్రమాణం చేసి పనిలో చేరిన ఉద్యోగులు, అధికారులు ఆ విషయాన్ని గుర్తు చేసుకోవాలని యనమల హితవు పలికారు.