పవన్ కళ్యాణ్ కోసం ఎడ్లబండిపై 760 కిమీ ప్రయాణం చేసిన రైతు

ఠాగూర్

సోమవారం, 16 డిశెంబరు 2024 (16:34 IST)
ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ను కలిసి తమ సమస్యలు చెప్పుకునేందుకు ఓ రైతు పెద్ద సాహసమే చేశారు. ఏకంగా 760 కిలోమీటర్ల దూరం ఎడ్లబండిపై ప్రయాణం చేశారు. ఈ రైతు హందూపురం నుంచి మంగళగిరి వరకు వచ్చారు. గత మూడు రోజులుగా పవన్ కళ్యాణ్ కోసం మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయం వద్ద ఎదురు చూస్తున్నారు. 
 
పవన్‌ను కలిసేందుకు ఓ యువ రైతు ఏకంగా 760 కిమీ దూరం ప్రయాణించడం ప్రతి ఒక్కరినీ ఆకర్షించింది. ఆ రైతు పేరు నవీన్. హిందూపురం నుంచి మంగళగిరికి 28 రోజుల పాటు ప్రయాణించి ఇటీవల మంగళగిరిలోని జనసేన కార్యాలయానికి చేరుకున్నారు. 
 
రైతులను ఎదుర్కొంటున్న కష్టాలను పవన్‌కు చెప్పాలని ఆ రైతు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల మీదుగా వందలాది కిలోమీటర్లు ఎడ్లబండిపై ప్రయాణించారు. ఆయా ప్రాంతాల్లోని రైతులతో మాట్లాడుతూ, వారి సమస్యలు కూడా తెలుసుకుంటూ ప్రయాణించారు. రైతు కష్టాలపై డిప్యూటీ సీఎం పవన్‌ను కలిసేందుకు అనుమతించాలని ఆ రైతు విజ్ఞప్తి చేస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు