సీబీఎస్‌ఈ టెన్త్ పరీక్షల్లో 95% స్కోర్‌ను సాధించిన 66 మంది తెలంగాణా ఆకాష్‌ ఇనిస్టిట్యూట్‌ విద్యార్థులు

గురువారం, 5 ఆగస్టు 2021 (16:59 IST)
ఆకాష్‌ ఇనిస్టిట్యూట్‌ యొక్క కరిక్యులమ్‌ మరియు పోగ్రామ్స్‌ ప్రభావానికి నిదర్శనంగా, తెలంగాణాలోని తమ ఇనిస్టిట్యూట్‌లకు చెందిన 66 మంది విద్యార్థులు సీబీఎస్‌ఈ క్లాస్‌ 10 బోర్డ్‌ 2021 పరీక్షలలో 95% కు పైగా స్కోర్‌ను సాధించారు. ఈ 66 మందిలో ముగ్గురు విద్యార్థులు 99%కు పైగా స్కోర్‌ను సాధించడం విశేషం. విజయ్‌ కులకర్ణి 99.4% స్కోర్‌ను సాధించగా, అథర్వ మోఘీ మరియు మణిదీప్‌ రామ్‌ గుంజీ లు 99% చొప్పున సాధించారు.
 
గణితం, సైన్స్‌ మరియు ఇతర బోధనాంశాలలో  కీలకమైన నేపథ్యాలను విద్యార్థులకు పూర్తిగా అర్థమయ్యేలా ఆకాష్‌ ఇనిస్టిట్యూట్‌ సహాయపడుతుంది. అందువల్ల వారు బోర్డు పరీక్షలలో అత్యున్నత స్ధాయి ప్రదర్శన కనబరుస్తుంటారు. తమ విద్యార్థులు పాఠశాల స్థాయి బోధనాంశాలలో పూర్తి అవగాహన కలిగి ఉన్నారని భరోసా అందించడంతో పాటుగా, ఆకాష్‌ ఇనిస్టిట్యూట్‌ అనుకూలీకరించిన శిక్షణను విద్యార్థులకు అందించడం ద్వారా ఇంజినీరింగ్‌, వైద్య, ఇతర ప్రొఫెషనల్‌ రంగాల కోసం ప్రవేశ పరీక్షలలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచేందుకు సహాయపడుతుంది.
 
ఈ ఫలితాలను గురించి ఆకాష్‌ ఎడ్యుకేషనల్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌(ఏఈఎస్‌ఎల్‌) మేనేజింగ్‌ డైరెక్టర్‌ శ్రీ ఆకాష్‌  చౌదరి మాట్లాడుతూ ‘‘మా సప్లిమెంటరీ ఎడ్యుకేషనల్‌ ప్రోగ్రామ్స్‌ ప్రధాన లక్ష్యం, తమ కరిక్యులమ్‌లో ప్రతి ఆలోచననూ విద్యార్థులు పూర్తిగా అర్ధం చేసుకునేలా సహాయపడటం మరియు వారు బోర్డు పరీక్షలకు సిద్ధమయ్యే తీరును ఆహ్లాదంగా మార్చడం. 
 
తెలంగాణాలోని మా 66 మంది విద్యార్థులు ఆకర్షణీయంగా 95%కు పైగా స్కోర్‌ను సీబీఎస్‌ఈ 10వ తరగతి పరీక్షలలో సాధించడం సంతోషంగా ఉంది. వారి విజయం మాకు పూర్తి సంతృప్తిని అందించింది. విద్యార్థులు కష్టించిన తీరును అభినందిస్తున్నాను మరియు వారికి మద్దతునందించిన తల్లిదండ్రులకు ధన్యవాదములు తెలుపుతున్నాను. ఈ విద్యార్థులు భవిష్యత్‌లో మరిన్ని విజయాలను సాధించాలని ఆకాంక్షిస్తున్నాను’’ అని అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు