ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ తమ మొబైల్ వినియోగదారుల కోసం సరికొత్త ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. హోలీ ధమాకా పేరుతో తీసుకొచ్చిన ఈ ప్లాన్ కాలపరిమితిని 425 రోజులుగా నిర్ణయించింది. వాస్తవానికి ఈ ప్లాన్ వ్యాలిడిటీ 395 రోజులు. కానీ మరో 30 రోజుల పాటు అదనపు కాలపరిమితిని కల్పించింది.
ఈ నెల 14వ తేదీన హోలీ వేడుకలు జరుగనున్నాయి. ఈ వేడుకలను పురస్కరించుకుని ఈ కొత్త ప్లాన్‌ను తీసుకొచ్చింది. బీఎస్ఎన్ఎల్ హోలీ ధమాకా ఆఫర్ రూ.2,399 ప్లాన్ వర్తిస్తుంది. ఈ ప్లాన్ అపరిమిత కాలింగ్, రోజుకు 2 రోజుల జీబీ డేటా, వంద ఎస్ఎంఎస్‌లు అందిస్తుంది.
ఈ ప్లాన్ వ్యాలిడిటీని 395 రోజుల నుంచి 425 రోజులకు పెంచింది. అంటే ఈ రీచార్జ్ ప్లాన్ ద్వారా నెల రోజుల అదనపు చెల్లుబాటును అందిస్తుందన్నమాట. ఈ మేరకు హోలీ ధమాకా ఆఫర్ వివరాలను తన అధికారిక ఎక్స్ ఖాతాలో వెల్లడించింది.