సర్వీస్, టెక్నాలజీ విషయంలోను మిగిలిన సంస్థలతో బీఎస్ఎన్ఎల్ పోటీ పడలేకపోతోంది. ఇందులో భాగంగానే మిగిలిన సంస్థలన్నీ 5జీ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాల్లో వుంటే బీఎస్ఎన్ఎల్ ఇప్పటికీ 4జీ టెస్టింగ్ వద్దే వుంది.
ఉద్యోగులకు జూన్ నెల వేతనాలు ఇచ్చేందుకు కేంద్రాన్ని బీఎస్ఎన్ఎల్ రూ.850కోట్ల రుణం ఇవ్వాల్సిందిగా దరఖాస్తు చేసుకుంది. సంస్థను కొన్ని నెలల పాటు నిలకడగా నడపాలంటే మొత్తం రూ.2500కోట్ల రుణం అవసరమవుతుందని కేంద్రానికి తెలిపింది.అయితే కేంద్రం నుంచి మాత్రం నిధులకు సంబంధించి ఇంతవరకు ఎటువంటి హామీ లభించలేదు. ఇదే పరిస్థితి కొనసాగితే బీఎస్ఎన్ఎల్ సేవలు ఆగిపోయే ఆస్కారం వుందని సమాతచారం.