ఉద్యోగ భవిష్యత్ నిధి (ఈపీఎఫ్ఓ) సంస్థ నుంచి ఆన్‌లైన్‌లో నగదు ఉపసంహరణ మరింత సులభతరం చేసింది. ఇకపై ఆన్‌లైన్‌లో డబ్బును విత్‌డ్రా చేసుకోవాలంటే క్యాన్సిల్ చెక్కును అప్‌లోడ్ చేసే అవసరాన్ని తప్పించింది. దీంతోపాటు బ్యాంకు ఖాతాను యజమానులు ధృవీకరించాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఈ ఫాస్ట్ ట్రాక్ క్లెయిమ్ సెటిల్‌మెంట్ ప్రక్రియతో దాదాపు ఎనిమిది కోట్ల మందికి ప్రయోజనం చేకూరనుంది. ఈ మేరకు కేంద్ర కార్మిక సంక్షేమ శాఖ గురువారం ఓ ప్రకటన చేసింది.
ఆ తర్వాత దరఖాస్తుదారుని బ్యాంకు ఖాతా వివరాలు కూడా యజమానులు ఆమోదించాల్సి ఉంటుంది. అంటే ఈ రెండంచెల వెరిఫికేషన్ పూర్తయిన తర్వాతే నగదు చేతికందేది. ఈ అవసరాన్ని ఈపీఎఫ్‌లో పూర్తిగా తొలగించినట్టు కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపింది. క్లెయిమ్ సెటిల్‌మెంట్ ప్రక్రియ వేగవంతం చేయడంతో పాటు క్లెయిమ్ తిరస్కరణల్ని తగ్గించేందుకు ఈ చర్యలు సాయపడుతాయని పేర్కొంది.