కరోనా కోరల్లో సెలెబ్రిటీలు.. మహారాష్ట్ర మంత్రి ఆదిత్య థాకరేకు పాజిటివ్
శనివారం, 20 మార్చి 2021 (19:52 IST)
Adithya Thackrey
కరోనా దేశంలో విజృంభిస్తోంది. ఈ క్రమంలో సెలెబ్రిటీలు కోవిడ్ బారిన పడుతున్నారు. తాజాగా మహారాష్ట్ర మంత్రి ఆదిత్య థాకరే కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా శనివారం నాడు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
తనలో కరోనా లక్షణాలు కనిపించడంతో కరోనా పరీక్ష చేయంచుకుంటే పాజిటివ్ అని తేలింది. ఇటీవల తనను కలసిన వారందరూ కరోనా టెస్టు చేయించుకోవాలని సూచిస్తున్నానని వెల్లడించారు. అంతేగాకుండా ఏమాత్రం అలక్ష్యం వహించవద్దని విజ్ఞప్తి చేశారు. అంతటితో ఆపకుండా కరోనా నిబంధనలు పాటించండంటూ ట్వీట్ చేశారు.
కాగా.. మహా ముఖ్యమంత్రి తనయుడు ఆదిత్య థాక్రే ప్రస్తుతం పర్యాటక, పర్యావరణ మంత్రిగా ఉన్నారు. ఇక మహారాష్ట్రలో కరోనా కలకలం కొనసాగుతోంది. అక్కడ కొత్తగా 13601 కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. 58 మంది కరోనాకు బలైపోయారు.