కరోనాకు మగలాళ్లంటే భలే ఇష్టమట..

గురువారం, 31 డిశెంబరు 2020 (11:11 IST)
కరోనా మహమ్మారి చేత పురుషులే అధిక సంఖ్యలో మరణిస్తున్నారని తేలింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత కరోనా వైరస్ మానవజాతిని అత్యంత భయానికి గురిచేసింది. భారత దేశంలో కోటి 2లక్షల మంది కరోనా బారిన పడ్డారు. ఇక లక్షా 47వేల మంది మృత్యువాత పడ్డారు. అయితే కరోనా వైరస్ భారత్‌లో మహిళలకంటే పురుషులకే ఎక్కువగా సోకింది. ఈ విషయం కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ లెక్కలు చెప్తున్నాయి. 
 
లక్షా 47వేల మంది మృతుల్లో 70 శాతం మంది పురుషులేనని కేంద్రం స్పష్టం చేసింది. కరోనాతో మృతి చెందిన పురుషుల్లో కూడా 60 ఏళ్ల లోపువారు 45 శాతం మంది ఉన్నారు. ఇక మొత్తం కరోనా కేసుల్లో 63 శాతం మంది పురుషులే ఉన్నారు. వారిలో 52 శాతం 18 నుంచి 44 ఏళ్ల వయసు లోపువారు ఉన్నారు. మిగిలిన 11 శాతం పురుషులే మృత్యువాత పడుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు