చాంపియన్స్ ట్రోఫీ : ఆస్ట్రేలియా ఆలౌట్... భారత్ టార్గెట్ ఎంతంటే?

ఠాగూర్

మంగళవారం, 4 మార్చి 2025 (18:21 IST)
చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా, దుబాయ్ వేదికగా మంగళవారం తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఇందులో ఆస్ట్రేలియా, భారత్‌లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా 264 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగింది. దీంతో భారత ఆటగాళ్ళు లక్ష్య ఛేదనలో ఆసీస్ స్పిన్నర్లను ఎదుర్కోవడమే పెను సవాల్‌గా మారనుంది. 
 
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీశారు. స్టీవ్ స్మిత్ 73, క్యారీ 61 పరుగులతో రాణించారు. ఫలితంగా 49.3 ఓవర్లలో 264 పరుగులకు ఆలౌట్ అయింది. ఫలితంగా భారత్ 265 పరుగుల భారీ విజయలక్ష్యాన్ని ఛేదించి, ఫైనల్‌లోకి అడుగుపెట్టాల్సివుంది.
ఆస్ట్రేలియా ఆటగాళ్లలో స్మిత్ 73, క్యారీ 61, హెడ్ 39, లబుషేన్ 29, డ్వార్షుయిస్ 19, ఇంగ్లిస్ 11, నాథన్ 10, మ్యాక్స్‌వెల్ 7 చూప్పున పరుగులు చేశారు. ఓపెనర్ కూపర్ కనోలీ డకౌట్ అయ్యాడు. భారత బౌలర్లలో షమీ 3, జడేజా 2, వరుణ్ చక్రవర్తి 2, అక్షర్, పాండ్యాలు ఒక్కో వికెట్ చొప్పున తీశారు. 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు