ప్రస్తుతం భారత అండర్ 19 క్రికెట్ జట్టు కోచ్‌గా సేవలు అందిస్తున్నాడు. ఈ అరుదైన గౌరవాన్ని దక్కించుకున్న భారతీయ క్రికెటర్లలో ద్రవిడ్ కంటే ముందు బిషన్ సింగ్ బేడీ, సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, అనిల్ కుంబ్లేలు ఉన్నారు.
ఇపుడు ద్రవిడ్‌తో పాటు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్, ఇంగ్లండ్ మహిళా జట్టు మాజీ వికెట్ కీపర్ క్లయిర్ టైలర్‌కు ఈ అరుదైన గౌరవాన్ని ఐసీసీ అధికారులు కల్పించారు. కాగా, మొత్తం 164 టెస్టులు, 344 వన్డేలు ఆడిన రాహుల్.. 'హాల్ ఆఫ్ ఫేమ్'లో చోటు దక్కడంపై సంతోషాన్ని వ్యక్తంచేశాడు.