ఏడ్వొద్దు.. నీకు నేను.. నాకు నువ్వు.. రోహిత్‌కి కోహ్లీ అండ

సెల్వి

శుక్రవారం, 28 జూన్ 2024 (15:12 IST)
Rohit Sharma
టీమిండియా టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్ చేరిన ఆనందంలో సార‌ధి రోహిత్ శ‌ర్మ భావోద్వేగానికి గురయ్యాడు. డగౌట్‌లో కూర్చొని క‌న్నీళ్లు పెట్టుకున్న అత‌డిని కోహ్లీ భుజం త‌ట్టి ఉత్సాహ‌ప‌రిచేందుకు ప్ర‌య‌త్నించాడు. 
 
ఇందుకు సంబంధించిన వీడియో, ఫొటోలు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. కాగా, ఈ మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆక‌ట్టుకున్న విష‌యం తెలిసిందే. 39 బంతుల్లో 57 పరుగులు చేసిన రోహిత్‌.. త‌న టీ20 అంత‌ర్జాతీయ కెరీర్‌లో 32వ హాఫ్ సెంచ‌రీని న‌మోదు చేశాడు.
 
ఇకపోతే.. ఫైనల్ కోసం టీమిండియా సిద్ధం అవుతుంది. సెమీఫైనల్లో దారుణంగా విఫలమైన శివమ్ దూబేను తప్పించి స్పెషలిస్ట్ బ్యాటర్ అయిన సంజూ శాంసన్ లేదా యశస్వి జైస్వాల్‌‌ను ఆడించే అవకాశం వుంది. ఓపెనర్‌గా విరాట్ కోహ్లీ తడబడుతున్న నేపథ్యంలో యశస్వి జైస్వాల్‌ను తుది జట్టులోకి తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ యశస్వి జైస్వాల్ జట్టులోకి వస్తే కోహ్లీ ఫస్ట్ డౌన్‌లో బ్యాటింగ్ చేయనున్నాడు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు