ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో న్యూజిలాండ్‌తో ఆదివారం దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా చెలరేగిన టీమిండియా 44 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. న్యూజిలాండ్ 45.3 ఓవర్లలో 205 పరుగులకు ఆలౌటై ఓటమి పాలైంది. కేన్ విలియమ్సన్ (120 బంతుల్లో 7 ఫోర్లతో 81) మినహా మరే బ్యాటర్ రాణించలేదు. వరుణ్ చక్రవర్తీ(5/42) ఐదు వికెట్లతో న్యూజిలాండ్ పతనాన్ని శాసించగా.. కుల్దీప్ యాదవ్(2/56) రెండు వికెట్లు పడగొట్టాడు. హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా తలో వికెట్ తీసారు.