భారత బౌలర్లలో దీప్తి మిడిల్ ఓవర్లలో బాగా బౌలింగ్ చేయడమే కాకుండా, రేణుకా సింగ్ ఠాకూర్, పూజా వస్త్రాకర్, శ్రేయాంక పాటిల్ చెరో రెండు వికెట్లు తీశారు.
దీప్తి శర్మ (3/20) మూడు వికెట్లతో చెలరేగింది. రేణుక ఠాకూర్ (2/14), పూజ వస్త్రాకర్ (2/31), శ్రేయాంక పాటిల్ (2/14) తలో రెండు వికెట్లు తీశారు.
అనంతరం ఛేదనలో భారత్ మూడు వికెట్లు కోల్పోయి 14.1 ఓవర్లలో లక్ష్యాన్ని సాధించింది. ఓపెనర్లు స్మృతి మంధాన (45; 31 బంతుల్లో, 9 ఫోర్లు), షెఫాలీ వర్మ (40; 29 బంతుల్లో, 6 ఫోర్లు, 1 సిక్సర్) విజృంభించారు. ఆరంభం నుంచే షెఫాలీ దూకుడుగా ఆడింది.