తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, పోతినీడుపాలెం గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి భార్య, ఇద్దరు కుమార్తెలు. అతని అక్కాబావ మృతి చెందగా వారి కుమారుడు పెదపూడి సత్యనారాయణను చేరదీసి పెద్ద కుమార్తెనిచ్చి 8 నెలల క్రితం పెళ్లి చేశాడు. సత్యనారాయణ మామతో కలిసి గ్రామంలో సెలూన్ షాపుతో పాటు ఆర్కెస్ట్రా నిర్వహిస్తున్నాడు.
ఆర్కెస్ట్రాలో పాటలు పాడేందుకు తన మరదలిని తీసుకెళ్లేవాడు. ఆ క్రమంలో వీరి మధ్య వివాహేతరబంధం ఏర్పడింది. కాగా ఇటీవల మరదలికి పెళ్లి కుదిరింది. పెళ్లయితే ఆమె తనకు దక్కదని కక్ష పెంచుకున్నాడు. శుక్రవారం రాత్రి గ్రామశివారుకు తీసుకెళ్లి చాకుతో గొంతుపై పలు మార్లు పొడిచాడు. ఆమె చనిపోయిందని భావించిన సత్యనారాయణ తన భార్యకు ఫోన్ చేసి మరదలి మృతదేహాన్ని తెచ్చుకోమని, తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పాడు.