ఏపీలోని కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. తమ బంధువుల మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న ఆరోపణల నేపథ్యంలో ఓ వ్యక్తిని కొందరు దుండగులు కలిసి అత్యంత దారుణంగా కాలు నరికేశారు. దానిని అందరికీ చూపించిన తర్వాత పోలీస్ స్టేషన్ సమీపంలోనే విసిరివేశారు.
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. కర్నూలు మండలం సూదిరెడ్డి పల్లెకు చెందిన శేషన్న (54) అనే వ్యక్తి ఇంట్లో ఉండగా, మంగళవారం అర్థరాత్రి అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు చొరబడి వేటకొడవళ్లు, కత్తులతో దాడి చేశారు.
శేషన్నను దారుణంగా హతమార్చిన తర్వాత అతడి కాలును నరికి వేరు చేశారు. ఆపై దానిని గ్రామంలో ప్రదర్శించి పోలీస్ స్టేషన్ సమీపంలో పడేశారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.