పైల్స్, మూత్రపిండ వ్యాధులున్నవారు బెండకాయలు తినకూడదా? ఎందుకని?

శనివారం, 30 జులై 2022 (14:16 IST)
కూరగాయల్లో ప్రతిదాంట్లో విటమిన్లు, ఔషధ గుణాలు వుంటాయి. ఉదాహరణకు బెండకాయను చూద్దాం. ఈ బెండకాయ తింటే తెలివితేటలు పెరుగుతాయని పెద్దలు అంటుంటారు. బెండకాయలో విటమిన్లు, ఖనిజాలు, పీచు పదార్థం పుష్కలంగా దొరుకుతాయని పోషక నిపుణులు పేర్కొంటున్నారు. బెండకాయలను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల వీటిల్లో దొరికే లెక్టిన్ అనే ప్రొటీన్ రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. బెండలోని ఫోలేట్లు అనేక రకాల క్యాన్సర్లను అడ్డుకుంటాయి. ఫోలేట్ లోపం వల్ల రొమ్ము, మెడ, క్లోమ, ఊపిరితిత్తుల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు. 

 
ముఖ్యంగా గర్భణీగా ఉన్నప్పుడు ఇవి మరీ అవసరం. బెండకాయ గింజల్ని ఎండబెట్టి చేసిన పొడి మధుమేహానికి మందుగా పనిచేస్తుంది. అనేక వ్యాధుల నివారణకు పండ్లూ, కూరగాయల్లోని పీచు ఎంతో అవసరం. బెండలో పీచు పుష్కలంగా దొరుకుతుంది. ఈ కాయల్లోని యాంటీ ఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ పేర్కొంటుంది. 

 
బెండకాయ గింజల్లోని పదార్ధాలు అద్భుత యాంటీ ఆక్సిడెంట్లలా పనిచేస్తూ ఒత్తిడిని తగ్గిస్తాయి. విటమిన్ కె ఎక్కువగా ఉండే బెండకాయలు ఎముకలకూ ఎంతో మంచిది. కాల్షియంను శోషించుకునేందుకు వీటిల్లోని ఇ విటమిన్ దోహదపడుతుంది. అయితే మొలలూ, మూత్రపిండ వ్యాధులు, కీళ్ళ నొప్పులూ ఉన్నవాళ్ళు వీటిల్లోని ఫ్రక్టేన్లూ, ఆక్సలేట్లూ, సొలమిన్ల కారణంగా తగు మోతాదులో తీసుకోవడం మంచిది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు