'కరోనా'పై నిజాలు దాస్తున్న డ్రాగన్ కంట్రీ : చైనా వైరాలజిస్టు సంచలన వ్యాఖ్యలు

సోమవారం, 13 జులై 2020 (18:17 IST)
చైనాకు చెందిన ఓ వైరాలజిస్టు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ గురించిన నిజాలను చైనా దాస్తోందంటూ అదే దేశానికి చెందిన వైరాలజిస్టు లి మెంగ్ యాన్ ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఈమె చైనా నుంచి హాంగ్‌కాంగ్‌కు పారిపోయి, తలదాచుకుంటున్నారు. 
 
ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ, కరోనా వైరస్ గురించిన అనేక నిజాలను చైనా బహిర్గతం చేయకుండా దాస్తోందని ఆరోపించారు. ఈ విషయంపై తాను మాట్లాడటంతో తన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. అందుకే చైనాను వీడినట్టు తెలిపారు. తనకు రక్షణ కల్పిస్తే మరిన్ని నిజాలు వెల్లడిస్తానని చెప్పింది. పైగా, తన ప్రాణాలకు అమెరికా రక్షణ కల్పించాలని కోరింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు