కన్నతండ్రినే కడతేర్చిన కొడుకు.. కొడుతూనే వున్నాడని.. ముక్కలు ముక్కలుగా..

గురువారం, 19 మే 2022 (12:54 IST)
కన్నకొడుకు బాగుపడాలనే ఉద్దేశంతో ఆ తండ్రి ప్రవర్తించాడు. కన్నకొడుకును కట్టుదిట్టం చేసేందుకు అతడిపై చేజేసుకునేవాడు. కానీ అదే అతడి ప్రాణం తీసింది. అవును తండ్రి కొడుతున్నాడన్న కారణంతో ఓ యువకుడు తన తండ్రిని అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. 
 
అనంతరం మృతదేహాన్ని ముక్కలుగా చేసి వివిధ ప్రాంతాల్లో పడేశాడు. అంతే కాకుండా కొన్ని శరీర భాగాలకు నిప్పంటించాడు. ఈ ఘటన పాకిస్థాన్‌లో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. పాకిస్థాన్‌లోని కరాచీ సమీపంలో సూపర్ హైవేపై అఫ్గాన్ బస్తీ వద్ద పోలీసులు గుర్తుతెలియని మృతదేహాన్ని గుర్తించారు. ఆ మృతదేహానికి తల, కాళ్లు లేకుండా ఉండటం, శరీర భాగాలను ముక్కలుగా నరికి బ్యాగులో పడేసి ఉండటంతో పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుడి వివరాలు గుర్తించి దర్యాప్తు చేపట్టగా పోలీసులకు విస్తుపోయే విషయాలు తెలిశాయి.
 
తల మొండెం లేని శరీరాన్ని గుర్తించడానికి ఫోరెన్సిక్​ బృందం చాలా కష్టపడి అతని ఆచూకీ గుర్తించారు. ఈ శరీర భాగాలు పీఐబీ కాలనీకి చెందిన సలీం ఖిల్జీగా గుర్తించారు. అతడి కొడుకుపై అనుమానం వచ్చి విచారించగా అతడు నేరాన్ని ఒప్పుకున్నట్లు చెప్పారు.
 
తన తండ్రి మృతదేహాన్ని ఎవరూ గుర్తించవద్దన్న ఉద్దేశంతో ఏప్రిల్​ 21న సుత్తితో కొట్టి హత్య చేసి ముక్కుముక్కలుగా చేసి వివిధ ప్రదేశాల్లో పడేశాడని అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు