చాలా మంది కోటీశ్వరులు, సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు, పారిశ్రామికవేత్తలు తమ వాహనాలకు ఫ్యాన్సీ నంబర్ ప్లేట్‌లు ఉండాలని భావిస్తారు. అలాంటి ఫ్యాన్సీ నంబర్ల కోసం ఎంతైనా ఖర్చు చేసేందుకు ఏమాత్రం వెనుకాడరు. తాజాగా ఓ వ్యక్తి ఫ్యాన్సీ నంబరు కోసం ఏకంగా రూ.15 కోట్లు ఖర్చు చేశాడు.
హాంకాంగ్ దేశంలో రవాణా శాఖ నిర్వహించిన ఫ్యాన్సీ నంబర్ల వేలం పాటల్లో ఓ వ్యక్తి ఏకంగా హెచ్.కె.14.2 మిలియన్లు ఖర్చు చేసి అంటే భారతీయ కరెన్సీలో రూ.15.83 కోట్లు పెట్టి అరుదైన 'S' అనే అక్షరంతో వచ్చే ఫ్యాన్సీ నంబర్ కొనుగోలు చేశాడు. అలాగే,88 అనే నంబరు ప్లేట్‌ను రూ.12 కోట్లకు మరో కోటీశ్వరుడు దక్కించుకున్నాడు. హాంకాంగ్ దేశంలో ఆ దేశ రవాణా శాఖ నిర్వహించిన వేలం పాటల్లో ఇది చోటుచేసుకుంది.