45మంది మైనర్ బాలికలపై అత్యాచారం.. పాకిస్థానీ దంపతుల అరెస్ట్

సోమవారం, 26 ఆగస్టు 2019 (16:03 IST)
పాకిస్థాన్‌, రావల్పిండికి చెందిన దంపతులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిద్దరూ కలిసి ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా 45మంది మైనర్ బాలికలపై అత్యాచారానికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా ఆ తతంగాన్నంతా వీడియోలు, ఫోటోలు తీసి బెదిరించి వారిని లొంగదీసుకునేవారు. ఆ వీడియోలను పోర్న్ వెబ్ సైట్లకు అమ్మేవారు. 
 
ఈ వ్యవహారం ఓ కాలేజ్ స్టూడెంట్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వెలుగులోకి వచ్చింది. ఈ నెల ఆగస్టు 3వ తేదీన రావల్పిండికి చెందిన నిందితులైన భార్యాభర్తలపై కేసు నమోదు కాగా, పోలీసులు ఆ దంపతులను ఆగస్టు 16వ తేదీన అరెస్ట్ చేశారు. ఆపై జరిగిన దర్యాప్తు వివరాల్లోకి వెళితే.. ఆ దంపతుల్లో నిందితురాలైన సదరు మహిళ ఓ కాలేజ్ స్టూడెంట్‌తో తానూ ఓ స్టూడెంట్ అంటూ నమ్మబలికింది. 
 
అలా స్నేహం చేసిన ఆ మహిళ ఓ రోజు కారులో తన సోదరుడు వస్తున్నాడని.. లిఫ్టిస్తానని యువతితో చెప్పింది. కానీ కారు రాగానే కత్తితో బెదిరించి.. కాలేజ్ స్టూడెంట్‌ను ఆ కారులో ఎక్కించుకోవడం జరిగింది. ఆపై ఆ యువతిని గులిస్థాన్‌లోని ఇంటికి తీసుకెళ్లారని, తర్వాత నిందితురాలి భర్త ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
ఈ తతంగాన్ని వీడియో తీశాక.. ఆ యువతిని తిరిగి అదే కారులో టిపు రోడులో వదిలిపెట్టి వెళ్లారు. కానీ బాధితురాలు ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులైన దంపతులను అరెస్ట్ చేశారు. విచారణలో ఆ దంపతులు డబ్బు కోసం మైనర్ బాలికలను కిడ్నాప్ చేసి.. వారిపై అకృత్యాలకు పాల్పడి.. ఆ వీడియోలను డబ్బుకు అమ్ముకునే వారని తేలింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు